- స్థానిక గోపాల్ నగరంలోని ఓక్ బ్రిడ్జ్ స్కూల్ నందు ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో అజాద్ క అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించడం కొరకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ముస్లిం రచయితల సంఘం అధ్యక్షులు షేక్ మహబూబ్ జాన్ పండిట్ తెలిపారు.
- ఈ కార్యక్రమము అందరిలో దేశభక్తి ని ఎంతో పెంపొందిస్తుందని , విద్యార్థుల యొక్క మంచి నడవడిక కు దోహదపడుతుందని నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారని గౌరవ అతిధి గా విచ్చేసిన శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవాసమితి అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు అన్నారు. విద్యార్థిని విద్యార్థులు భారతమాత, ఝాన్సీ లక్ష్మీబాయి ,వీర పాండ్య కట్ట బ్రహ్మన్న గాంధీజీ ,భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, చిన్నమ్మ దేవి జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు ,తదితర వేషధారణలతో వారి వారి చరిత్రలను అభినయం ద్వారా అందరికీ తెలియజేశారు .
- ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఈపూరు శివప్రసాద్ హిందీ ఉపాధ్యాయులు హుమా యన్ ఉపాధ్యాయు రాళ్లు స్వర్ణ దేవి, రాజేశ్వరి ,శ్రీలక్ష్మి ఝాన్సీ సువర్ణ భార్గవి, శివకుమారి, వరలక్ష్మి, రోహిణి ,అన్నపూర్ణ ,జ్యోతి తదితరులు పాల్గొన్నారు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని నిర్వహించిన ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం వారికి కరస్పాండెంట్ శివ ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు.