ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల పై నిషేధం.. ఉల్లంఘిస్తే ఫైన్!

0
7
Ban on plastic flexi in AP.. Violation fine!

అమరావతి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలో ఉత్పత్తి, దిగుమతిగా అనుమతి లేదని తెలిపింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగం, ముద్రణ, రవాణా ప్రదర్శనపైన నిషేధం విధించింది. ఈ నిషేధం అమలులో నగరాలు, పట్టణాలు అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది.

గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జీవో జారీ చేసింది. నిషేధం అమలును పోలీస్, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపింది. ప్లాస్టిక్ కు బదులుగా కాటన్, నేత వస్త్రాలు వాడాలంటూ ఉత్తర్వులు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here