Bangladeshలో అమాంతం పెరిగిన పెట్రోల్ ధర

0
5

బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడి ప్రజల నెత్తిన పెద్ద పిడుగు వేసింది. ఇంధన ధరలను అమాంతం పెంచేసింది. ఉన్న ధరపై 50 శాతం అధికంగా రేటును పెంచింది. దాంతో అక్కడి జనం గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఇంధన ధరలను 51.7 శాతం వరకు పెంచింది. 1971లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక పెరుగుదల ఇదేనని అక్కడ మీడియా నివేదికలతో తెలుస్తుంది.ప్రభుత్వం కొత్త ధరలను ప్రకటించిన తర్వాత శుక్రవారం రాత్రి పెట్రోల్ బంక్‌ల దగ్గరకు జనం పరుగులు తీశారు. వేలాది సంఖ్యలో వాహనదారులు బంక్‌ల దగ్గరకు చేరుకున్నారు. కొత్త ధరలు అమల్లోకి రాకముందే తమ వాహనాల ట్యాంకులను నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొత్త ధరలు అమల్లోకి రావడంతో ఢాకాలోని మొహమ్మద్‌పూర్, అగర్‌గావ్, మాలిబాగ్, ఇతర ప్రాంతాల్లో అనేక పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్‌లు కొత్త ధరలు అమల్లోకి వచ్చాయని, అర్ధరాత్రి తర్వాత అమ్మకాలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించాయి. ఈ మేరకు ఆ స్టేషన్‌లను క్లోజ్ చేశారు. దీంతో కొన్ని చోట్ల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here