ఆ తొమ్మిది రోజులు పల్లెలన్నీ పూల వనలే!

0
6

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ. ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ. తొమ్మిది రోజులపాటు జరిగే పకృతి పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పూల పండుగలో రోజుకో ప్రత్యేకం. ఎంగిలిపూలతో ప్రారంభమైన పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. తొమ్మిది రోజులపాటు జరిగే పండుగలో తెలంగాణ పల్లెలన్నీ పూలవనాలను తలపిస్తాయి.

తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు ఆడబిడ్డలు. అమావాస్య రోజున మొదటి రోజు బతుకమ్మ ఆడతారు. ఆ రోజు పెత్రమాస (పెత్తర అమావాస్య) అంటారు. ఈసారి పెత్తర అమావాస్య సెప్టెంబరు 25న వచ్చింది.

మొదటి రోజు- ఎంగిలిపూల బతుకమ్మ

రెండో రోజు- అటుకుల బతుకమ్మ

మూడో రోజు- ముద్దపప్పు బతుకమ్మ

నాలుగో రోజు- నానే బియ్యం బతుకమ్మ

ఐదో రోజు- అట్ల బతుకమ్మ

ఆరవ రోజు- అలిగిన బతుకమ్మ

ఏడో రోజు- వేపకాయల బతుకమ్మ

ఎనిమిదవ రోజు- వెన్నముద్దల బతుకమ్మ

తొమ్మిదో రోజు- సద్దుల బతుకమ్మ

గ్రామీణ ప్రాంతాల్లో కష్టాసుఖాలను పాటల రూపంలో పలికే పండుగ బతుకమ్మ. అడవిలో దొరికే గునుగు, తంగేడు పూలను ఏరుకొచ్చి అందంగా బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలంకరించి ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారు. రకరకాల పువ్వులతో దేవతలను పూజించటం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ ప్రత్యేకత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here