Big Discount on Samsung phone:

0
17

శాంసంగ్ ఫోన్‌పై భారీ తగ్గింపు – 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.13 వేలలోపే……!

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో తగ్గించింది. దీనిపై రూ.2,000 మేర తగ్గింపును అందించారు. ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి.

  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 ధర
  • ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.12,499గా ఉండగా, ఇప్పుడు రూ.10,499కు తగ్గింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499 నుంచి రూ.12,499కు తగ్గింది. డెనిమ్ బ్లాక్, డెనిమ్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.1,000 తగ్గింపు లభించనుంది.
  • శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్పెసిఫికేషన్లు
    ఈ ఫోన్‌లో 6.4 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
  • కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
  • ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఇందులో ఉంది. 15W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here