శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. మియాపూర్లోని ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటున్న జ్ఞానేంద్ర ప్రసాద్ సోమవారం (ఆగస్టు 8) ఉదయం తన ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించారు. కుటుంబ సభ్యులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. ఆత్మహతకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.