మద్యం వ్యాను బోల్తా, పోటెత్తిన మందుబాబులు
విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం వీపీ రేగ జంక్షన్ దగ్గరలో ప్రభుత్వ మద్యం తరలిస్తున్న వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. సగానికి పైగా మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. కొంత మంది మద్యం ప్రియులు సంఘటనా స్థలానికి చేరుకొని దోచుకున్నారు. మద్యం వ్యాన్ బోల్తా పడడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.