Breaking news: Bypoll in Munugodu

0
5

మునుగోడు బైపోల్‌ హడావుడి.. ఏ పార్టీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయ్ ?………

  •  మునుగోడులో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది.. గెలుపు దారి కోసం పార్టీలన్నీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయ్.
  • ఇంతకీ ఏ పార్టీ ఎలాంటి సన్నాహాలు చేస్తోంది.. బైపోల్‌ ఫలితాన్ని డిసైడ్‌ చేయబోయే అంశాలు ఏంటి.. మునుగోడు ఉప ఎన్నికను శాసించబోయేది పార్టీలా.. వ్యక్తులా..
  • మునుగోడు ఉప ఎన్నికలను టీఆర్ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు ఉపఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన టీఆర్‌ఎస్‌.. మునుగోడులో భారీ మెజారిటీతో గెలిచి తెలంగాణాలో తిరుగులేదని చాటుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేంద్రం హోంమంత్రి అమిత్‌ షాను.. ఢిల్లీలో రాజగోపాల్‌ రెడ్డి ఇలా కలిశారో లేదో ఇక్కడ కేసీఆర్ అలర్ట్ అయ్యారు. మునుగోడు బై పోల్‌ను ముందే ఊహించి.. అక్కడి పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌ రెడ్డి.. గత ఎన్నికల్లో మునుగోడులో టీఆర్ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ప్రభాకర్‌ రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో చర్చించారు.
  • అక్కడ ఉన్న సమస్యలతో పాటు అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఎప్పటినుంచో వినిపిస్తున్న గట్టుప్పల్‌ మండల డిమాండ్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఓ రకంగా ఉపఎన్నికకు ఇప్పటికే టీఆర్‌ఎస్ రెడీ అయ్యింది.
  • ఇక సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవడం కాంగ్రెస్‌కు ఇప్పుడు జీవన్మరణ సమస్యగా మారింది. వరుస ఎన్నికల్లో దెబ్బలు తింటున్న హస్తం పార్టీకి.. మునుగోడు ఉప ఎన్నిక సవాల్‌గా మారనుంది. మునుగోడులో ఫలితం తేడా కొడితే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖతమ్ అయినట్లే అన్న ప్రచారం జరుగుతోంది. దుబ్బాక, హుజురాబాద్‌లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్‌కు.. మునుగోడులో అదే సీన్‌ రిపీట్ అయితే.. వచ్చే ఎన్నికల్లో పార్టీకి కష్టకాలం తప్పదు. దుబ్బాక, హుజూరాబాద్‌ తమ సీటు కాదంటూ తేలికగా తీసుకున్న కాంగ్రెస్ నేతలకు.. ఇప్పుడు సిట్టింగ్ స్థానంలో వచ్చిన ఉపఎన్నిక సవాల్‌గా మారింది.
  • పీసీసీ చీఫ్‌ రేవంత్‌కు ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం. అధికారం కాంగ్రెస్‌దే అని పదేపదే చెప్తున్న రేవంత్‌కు.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మునుగోడులో మ్యాటర్‌ తేడా కొడితే.. సొంత పార్టీ నేతలే రేవంత్‌ను టార్గెట్‌ చేసే అవకాశం ఉంది. తమ్ముడి తిరుగుబాటుతో ఆత్మరక్షణలో పడ్డ బిగ్ బ్రదర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఆసక్తిగా మారింది.

  • ఇక కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డిని తమ దళంలోకి లాగేసుకున్న కమలం.. మునుగోడు విజయంతో అసెంబ్లీ ఎన్నికలకు రూట్ క్లియర్‌ చేసుకోవాలని ఫిక్స్ అయింది.
  • ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా.. మునుగోడులో మహా యుద్ధం జరగబోతోందన్నది మాత్రం పక్కా ! పార్టీల కంటే.. వ్యక్తులే ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో ఓట్లు పడబోయేది పార్టీల కంటే.. వ్యక్తిని చూసి మాత్రమే అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పార్టీల కంటే వ్యక్తులే మునుగోడు ఉప ఎన్నికను శాసిస్తారన్న చర్చ నడుస్తోంది. పార్టీకి, పదవికి రాజీనామా చేస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో ఉండలేనని.. తన రాజీనామాతో అయినా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందంటూ మనసు తాకే ప్రయత్నం చేశారు. మరి ఈ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా.. పదవి వదులుకున్నారన్న సింపతీతో జనం ఓట్లు కురిపించి మళ్లీ ఎమ్మెల్యే కుర్చీలో కూర్చోబెడతారా అన్నది కీలకంగా మారింది.
  • మునుగోడు నియోజరవర్గంలో చాలా రోజులుగా రకరకాల డిమాండ్లు వినిపిస్తున్నాయ్. ఈ ఉపఎన్నికల్లో అవి కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో గిరిజన ఓటర్లు ఎక్కువ! ఒకరకంగా ఫలితాన్ని డిసైడ్ చేసేది కూడా వాళ్లే ! తన రాజీనామా ప్రకటన సమయంలో పోడు భూముల సమస్యను ప్రత్యేకంగా తెరమీదకు తీసుకువచ్చారు రాజగోపాల్ రెడ్డి. ఈ అంశం బైపోల్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది. వీటితో పాటు బైపోల్‌ ప్రచారంతో పాత డిమాండ్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయ్.
  • ఎప్పటి నుంచో వినిపిస్తున్న గట్టుప్పల్ మండల డిమాండ్‌కు ఈ మధ్యే సర్కార్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా చండూరు రెవెన్యూ డివిజన్ చేయాలనే ప్రతిపాదన వినిపిస్తోంది. దీనికితోడు నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని కోమటిరెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. ఇది కూడా బైపోల్‌లో కీలకంగా మారే చాన్స్ ఉంది. ఉపఎన్నిక వేళ కొత్త పథకాలతో పాటు నియోజకవర్గానికి కొత్త నిధులు వచ్చే అవకాశం లేకపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here