BREAKING NEWS: నీటి కుంటలో పడి అన్నదమ్ముల మృతి…

0
10
  • ఉమ్మడి అనంతపురం జిల్లా గుడిబండ మండలం గుడదహళ్ళిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అన్నదమ్ములను నీటికుంట బలి తీసుకుంది.
  • వివరాల్లోకి వెళ్తే గుడదహళ్లికి చెందిన రాజు అనే వ్యక్తికి ఎనిమిదో తరగతి చదువుతున్న హరీష్ , ఐదో తరగతి చదువుతున్న భరత్, అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే ఇద్దరు అన్నదమ్ములు మంగళవారం పశువులను మేపేందుకు పొలం తోలుకెళ్లారు. అయితే పొలంలో ఉన్న నీటి కుంటలో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు.
  • పశువులను తోలుకెళ్లిన పిల్లలు ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో తండ్రితోపాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఊరంతా గాలించారు. మంగళవారం అర్థరాత్రి వరకు గాలించినా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో బుధవారం ఉదయం కూడా గాలించారు.
  • అయితే నీటికుంటలో ఇద్దరి మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. కొడుకుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here