Chandrababu దృష్టంతా సొంత లాభంపైనే

0
1

-MP విజయసాయిరెడ్డి.

చంద్రబాబుకు హస్తినే కాదు, అమరావతీ దూరమే.దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎప్పుడో పాతికేళ్ల క్రితం ‘చక్రం తిప్పాను’ అని ఇప్పటికీ మధురస్మృతిగా చెప్పుకునే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎట్టకేలకు హస్తినలో గడిపే అవకాశం వచ్చిందని YSRCP పార్టీ నాయకుడు,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఢిల్లీ పర్యాటనపై ఆదివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలు చంద్రబాబుకి మహద్భాగ్యం కల్పించాయని వ్యాఖ్యానించారు. దీంతో, మళ్లీ పాత వరవడిలోకి వచ్చే ప్రయత్నం చేశారు ఈ మాజీ హైటెక్‌ సీఎం.
‘మీరు తరచూ ఢిల్లీకి ఎందుకు రావడం లేదు?’ అని చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ అడిగారని టీడీపీ మౌత్‌ పీస్‌గా ఉపకరించే ఓ తెలుగు దినపత్రిక తెలిపింది. ప్రధాని మోదీ అడిగినట్లు విభజిత ఆంధ్రప్రదేశ్‌ ‘తొలి ముఖ్యమంత్రి’ చంద్రబాబు ఢిల్లీకే కాదు, అమరావతికీ రావడం లేదని ఎద్దేవా చేశారు. ఆయనకు ఢిల్లీకి రమ్మని పిలిచేవారు లేరు, అమరావతిలో ఉండాలని అడిగేవారూ లేరు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు కాలంలో మాదిరిగా ఉత్తరాది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కనీసం మాట్లాడే ప్రయత్నం చంద్రబాబు చేయడం లేదు. యూపీ, బిహార్‌ ను గతంలో పరిపాలించిన పూర్వపు జనతా పరివార్‌ పార్టీలు సైతం చంద్రబాబును పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఈ పార్టీల వైఖరిలో మార్పు కాదు, చంద్రబాబు ఉష్ట్రపక్షి ధోరణే జాతీయ రాజకీయాల్లో ఆయనను ఏకాకిని చేసిందని అన్నారు.
సీఎం పీఠంపై ఉంటే–అమెరికా అధ్యక్షుడు జోసెఫ్‌ బైడన్‌తో సైతం మాట్లాడడానికి ప్రయత్నించే బాబు రాజకీయంగా నేడు ఒంటరి అయ్యాడని ఎద్దేవా చేశారు. 1996–2004 మధ్య కేంద్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించానని చెప్పుకోవడం ఆయనకు ఆనవాయితీగా మారడమేగాదు, మళ్లీ ‘అలాంటి రోజులు ఎప్పుడొస్తాయా?’ అని ఆయన ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. విభజిత ఏపీలో సుపరిపాలన అందిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై నిరంతర అడ్డగోలు విమర్శలు, పాలకపక్ష నేతలపై వ్యక్తిగత దాడులు చేయడంపైనే దృష్టి పెట్టడం వల్ల చంద్రబాబుకు మెడ తిప్పుకునే తీరిక కూడా లేకపోయిందట..అని అన్నారు.

ప్రధానితో చెప్పాల్సినవి చాలా ఉన్నాయట!

చంద్రబాబుతో చాలా విషయాలు మాట్లాడాలని ఉందని ప్రధాని అన్నట్టు కూడా పై మీడియా సంస్థ తెలిపిందని చెప్పారు. ప్రధాని పిలిస్తే రెక్కలు కట్టుకుని ఢిల్లీ వచ్చి వాలిపోవడానికి సదా సిద్ధంగా ఉండే చంద్రబాబుతో ప్రధాని ఎలాంటి విషయాలు చర్చిస్తారో చూద్దాం అంటూ.. వ్యంగ్య వ్యాఖ్యానాలు సందించారు. హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ నివాసంలో ఒంటరి జీవితం గడుపుతూనే, జగన్‌ సర్కారుపై వికృత దుష్ప్రచారానికి మార్గదర్శకం చేసే చంద్రబాబుపై ప్రధాని మోదీ జాలిపడడం నిజంగా వార్తే అని చెప్పారు. చంద్రబాబు తొందర్లోనే ప్రధానితో భేటీకి అపాంట్‌మెంట్‌ తెచ్చుకుని జాతిహితం కోసం ఎలాంటి సలహాలు ఇస్తారో మరి! బిల్‌ క్లింటన్, బిల్‌ గేట్స్‌ పేర్లు చెప్పుకుని పదేళ్లు గడిపిన బాబుకు దేశ ప్రధాని అవసరం, భారత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే అవసరం ఇన్నాళ్లకు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 1996లో బాగా పరిచయమైన ఢిల్లీ వీధులను మర్చిపోకుండా ఉండాలంటే ఇలా హస్తినకు కేంద్ర సర్కారు ఆహ్వానంపై రెండేళ్లకు ఒకసారైనా చంద్రబాబు గారికి వచ్చే అవకాశం ఉంటే మంచిదేమో! అని విజయసాయిరెడ్డి అన్నారు.

పత్రిపక్ష నేత చంద్రబాబుకు ఎన్ని ఎలివేషన్స్ ఇస్తారు? ఎన్ని అబద్దాలు చెప్పి జాకీలేసి లేపుతారు? అని టిడిపి అనుకూల మీడియాను ఆయన ప్రశ్నించారు. ప్రధాని బతిమిలాడుతున్నట్లు…బాబుకే టైంలేక ఢిల్లీ వెళ్ళనట్లు పచ్చ మీడియా ప్రచారం సాగిస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు విషయంలో”అక్క”ఆరాటమే తప్ప “బావ” బతకడన్నట్లుంది పచ్చ మీడియా పరిస్థితి వుందని ఆయన ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here