పీవీ సింధును..ప్రత్యేకంగా అభినందిచన సీఎం కేసీఆర్‌

0
8
  • కామన్‌వెల్త్ క్రీడల్లో హైదరాబాదీ పీవీ సింధు స్వర్ణాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు..కెనడా ప్లేయర్‌ మిచెల్లీ లీపై అలవోక విజయం సాధించింది.
  • ఈ నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
  • పసిడి పతకంతో మెరిసిన పీవీ సింధును సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలతో సత్తాచాటిన నిఖత్‌ జరీన్‌, పీవీ సింధు, ఆకుల శ్రీజ, పుల్లెల గాయత్రి గోపీచంద్‌, సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి, శరత్‌ కమల్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. సింధు స్వర్ణ పతకం సాధించడం పట్ల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్‌ క్రీడల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌. తెలిపారు. దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీని రాష్ట్రంలో రూపొందిస్తున్నామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here