పౌరసరఫరాల శాఖపై CM వైయస్‌.జగన్‌ సమీక్ష

0
4
cm jagan

క్యాంపుకార్యాలయంలో పౌరసరఫరాల శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

లైన్‌ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతంగా సమన్వయం:

 • రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి: సీఎం
 • విత్తనం నుంచి పంటకొనుగోలు దాకా, పిషరీస్, పశుసంవర్థక, ఉచిత విద్యుత్, సీహెచ్‌జీల నిర్వహణ తదితర కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నాయి:
 • ఈకార్యకలాపాలు సమర్థవంతంగా ముందుకు సాగాలంటే.. సంబంధిత శాఖలతో (లైన్‌ డిపార్ట్‌మెంట్స్‌) చక్కటి సమన్వయం అవసరం:
 • వ్యవసాయం, ఫిషరీస్, రెవిన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ తదితర శాఖలతో సమన్వయం సమర్థవంతంగా ఉండాలి:
 • నిర్వహిస్తున్న కార్యకలాపాలకు సంబంధించి వివిధ శాఖలతో కలిసి అనుసంధానమై ముందుకు సాగాల్సిన అవసరం ఉంది:
 • ఈ ప్రక్రియ సజావుగా ముందుకు సాగేందుకు వీలుగా సమర్థవంతమైన మార్గదర్శక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి:
 • దీనిపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశం.

క్రమం తప్పకుండా భూసార పరీక్షలు:

 • అవసరం లేకపోయినా, విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించాలి:
 • దీనిపై అధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది:
 • ప్రతిరైతుకు తన భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలి:
 • రైతు సాగుచేస్తున్న భూమి స్థితిగతులు ఏంటి? ఎలాంటి పంటలకు అనుకూలం? ఎలాంటి రకాలు వేయాలి? ఎంతమోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కల్పించాలి:
 • దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువుల వాడకం తగ్గుతుంది:
 • ఒక మనిషికి డాక్టర్‌ ఎలా ఉపయోగపడతాడో, పంటలసాగులో రైతులకు ఆర్బీకేలు అదే విధంగా ఉపయోగపడాలి:
 • ప్రతి ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత సాయిల్‌టెస్టులు చేసేవిధంగా ఒక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం.
 • వైద్య ఆరోగ్యశాఖలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తరహాలో.. ఒక కార్యక్రమాన్ని రూపొందించి క్రమం తప్పకుండా రైతులకు ఈ విషయంలో సలహాలు సూచనలు గ్రామాల్లో అందాలన్న సీఎం

ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం:

 • ఖరీఫ్‌ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి:
 • కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదు:
 • రైతులకు ఎంఎస్‌పీ ధర అందాల్సిందే:
 • ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదు:
 • ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ టెస్టింగ్, క్వాంటిటీ టెస్టింగ్‌ జరగాలన్న సీఎం.
 • ధాన్యం కొనుగోలు ప్రక్రియమీద, ఎంఎస్‌పీ మీద, అనుసరించాల్సిన నియమాలమీద రైతుల్లో అవగాహన కల్పించాలన్న సీఎం.
 • దీనికి సంబంధించి కరపత్రాలను, పోస్టర్లను, హోర్డింగ్‌లను పెట్టాలన్న సీఎం.
 • ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 • ఆర్బీకేల స్థాయిలో వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం.
 • దాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామసచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలన్న సీఎం.
 • వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలన్న సీఎం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here