ప్రముఖ కమెడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూత.

0
10

ప్రముఖ హాస్య నటుడు రాజు శ్రీవాస్తవ జిమ్‌ చేస్తూ గత నెల 10న గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంటిలెటర్‌ సపోర్టుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. ఆగష్టు 10న ఆయనకు గుండె పోటు రావడంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు, శ్రీవాస్తవ వయసు 58 ఏళ్లు.

ఆగష్టు 10న రాజు శ్రీవాస్తవ డైలీ ఎక్సర్‌సైజులో భాగంగా… జిమ్‌లో ఉన్నారు. అక్కడ త్రెడ్ మిల్ పై నడుస్తుండగా ఆయనకు ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే అక్కడున్న వారంతా ఆయనను ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. దాదాపుగా 40 రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీవాస్తవ్ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here