కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్‌కి స్టీఫెల్ఛేజ్లో శనివారం రజత పతకం లభించింది. ఫురుషుల 3000మీ స్టీఫెల్ఛేజ్ ఫైనల్లో పోటీపడిన అవినాష్ సాబ్లే రెండో స్థానంలో నిలిచి.. సిల్వర్ మెడల్ని గెలుపొందాడు. 27 ఏళ్ల అవినాష్ 3000మీ స్టీఫెల్ఛేజ్ని ఈరోజు 8:11:20 టైమింగ్‌తో పూర్తి చేశాడు. అవినాష్ కేవలం 0.05 సెకన్ల తేడాతో గోల్డ్ మెడల్ని చేజార్చుకున్నాడు.ఈరోజు 3000మీ స్టీఫెల్ఛేజ్ ఫైనల్లో కెన్యాకి చెందిన అబ్రహాం 8:11:15 సెకన్ల టైమింగ్‌తో గోల్డ్ మెడల్ని ఎగరేసుకుపోయాడు. కేవలం 0.05 సెకన్లు వెనకబడిన అవినాష్ రజతంతో సరిపెట్టినా.. ఆఫ్రికన్ అథ్లెట్లని వెనక్కి నెట్టిన అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అవినాష్ భారత ఆర్మీలో పనిచేస్తున్నాడు. అతను గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లోనూ 3000మీ స్టీఫెల్ఛేజ్లో పోటీపడ్డాడు.అవినాష్ గెలిచిన రజత పతకంతో.. భారత ఖాతాలో పతకాల సంఖ్య 28కి చేరింది. ఇందులో 9 గోల్డ్ మెడల్స్ ఉండగా.. 10 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. ఓవరాల్‌గా పతకాల పట్టికలో భారత్ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.