బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత ఉమెన్స్ క్రికెట్ టీమ్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్ ఉమెన్స్ టీమ్‌తో శనివారం జరిగిన సెమీ ఫైనల్ -1 మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడిన భారత్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా.. లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ టీమ్ 160/6కే పరిమితమైంది. ఇక ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 9:30 గంటలకి జరగనుంది.