ఇంజనీరింగ్ సిబ్బంది మెరుగైన పనితీరుతో తిరుపతి అభివృద్ధి

0
9
Development of Tirupati with improved performance of engineering staff

తిరుపతి నగరాభివృద్దికి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది మెరుగైన పనితీరుతో ముందుకెలుతున్నట్లు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సిబ్బంది పనితీరుపై కమిషనర్ అనుపమ అంజలి మునిసిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డిలకు అభివృద్దిపై సూచనలు చేస్తూ తిరుపతి స్థానానికి దేశంలోనే ఓక ప్రత్యేక స్థానం వున్నదనే విషయాన్ని గమనంలో వుంచుకొని ఇటు ప్రజలు, అటు యాత్రీకులను దృష్టిలో వుంచుకొని తగు అభివృద్ది పనులను చేపట్టాలన్నారు.

ఈ ఆర్ధిక సంవత్సరం 2022-23 యొక్క పనితీరు గురించి కమిషనర్ అనుపమ చర్చిస్తూ జనరల్ ఫండ్స్ క్రింద రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, వాటర్ సప్లై, సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర 96 పనులకు 26 కోట్ల 62 లక్షలు కేటాయించగా, అందులో ఇప్పటి వరకు 1 కోటి 51 లక్షలతో 19 పనులు పూర్తి చేయడం జరిగిందని, మరో 29 పనులు 6 కోట్ల 85 లక్షలతో జరుగుతున్నాయని, 15 కోట్ల 64 లక్షల విలువగల 35 పనులు టెండర్ దశలో వున్నాయన్నారు.

ఇక 15వ ఫైనాన్స్ ఫండ్స్ గురించి వివరిస్తూ 15 పనులకు 11 కోట్ల 27 లక్షలు కేటాయించగా, అందులో ఇప్పటి వరకు 4 కోట్ల 61 లక్షలతో 7 పనులను పూర్తి చేయడం జరిగిందని, 4 కోట్ల 65 లక్షల విలువగల 3 పనులు టెండర్ స్టెజ్ లో వున్నాయని, మరో 5 వర్కులు మొదలుపెట్టడం జరుగుతుందన్నారు. హరిత నగరాలు ఫండ్స్ గురించి మాట్లాడుతూ తిరుపతి నగరంలో పచ్చదనం పెంపు, రక్షణ, డివైడర్లపై మొక్కల పెంపుపై 2 కోట్ల 70 లక్షలతో 6 పనులు జరుగుతున్నాయని తెలుపుతూ మరింత పర్యవేక్షన చేపట్టాలని అధికారులకు సూచనలు జారీచేసారు.

శాప్ నిధులు 43 లక్షలతో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే పనులు చేపడుతున్నట్లు, 44 లక్షల ఎం.పి నిధులతో 7 పనులు చేపట్టెందుకు టెండర్లు ఆహ్వానించడం జరుగుతున్నదన్నారు. గత జూన్ నెలలో జరిగిన డ్రైనేజీ ప్రమాదంలో ఇద్దరు మునిసిపల్ సిబ్బంది, మరో బయట వ్యక్తి డ్రైనేజిలో దిగి మృతి చెందిన సంఘటన గురించి చర్చిస్తూ, భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలకు తావు లేకుండా పనితీరును మెరుగు పరుచుకోవాలని, నిత్యం అధికారుల పర్యవేక్షణ వుండాలన్నారు. ఇక సఫయి కర్మచారి ఫండ్స్ క్రింద 45 లక్షలు వెచ్చించి డ్రైనేజి శుభ్రం చేసే కార్మికులు, ఎస్.టి.పి ప్లాంట్ సిబ్బందికి అవసరమైన గ్లౌజులు, హెల్మెట్స్, గమ్ బుట్లూ, సేప్టి యూనిఫామ్, గ్యాస్ మ్యానిటర్స్, డిటెక్టర్స్ కొనుగులు చేస్తున్నామని, మరో 22 లక్షలతో సీవర్ క్లీనింగ్ మిషన్ తెప్పించడం జరుగుతుందన్నారు.

తిరుపతి నగరపాలక సంస్థలో విది నిర్వహణలో వున్న డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, దేవిక, రవీంధ్రరెడ్డి, గోమతి, మహేష్, ఎలక్ట్రికల్ డిఈ నరేంధ్రలు ఎప్పటికప్పుడు క్రిందిస్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకొని తిరుపతి నగరాభివృద్దికి కృషి చేయాలని కమిషనర్ అనుపమ అంజలి సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here