DGPకి లేఖ రాసిన వాసిరెడ్డి పద్మ

0
7
Vasireddy-Padma

ఏపీలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని టీడీపీ విమర్శలు చేసింది. అయితే ఈ వ్యవహారం‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రభుత్వానికి సూచించారు. వెంటనే విచారణ చేపట్టాలని డీజీపీకి లేఖ రాశారు. ఈ ఘటనలో నిజానిజాలను త్వరగా నిగ్గుతేల్చాలని కోరారు. ఈమేరకు డీజీపీకి శనివారం లేఖ రాసినట్లు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here