ఉదయాన్నే పచ్చి పాలను తాగే అలవాటు ఉందా…?

0
10
  • Drinking Raw Milk : పాలు తాగితే ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనలో కొంతమంది పాలను వేడి చేయకుండా పచ్చిగా తాగుతారు.కొంతమంది పాలను వేడి చేసి తాగుతారు. అయితే పాలు పచ్చివి తాగాలా లేదా బాగా వేడి చేసి తాగాలా.అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది.
  • పాలను పచ్చిగా తాగకూడదు.ఒక్కసారైనా వేడి చేయాలని నిపుణులు చెప్పుతున్నారు. అలా వేడి చేయకుండా పచ్చిగా పాలను తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. పచ్చి పాలల్లో హానికరమైన బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. పచ్చి పాలల్లో ఉండే సాల్మోనెల్లా, ఈకోలి, లిస్టేరియా, క్యాంపిలోబాక్టర్ వంటి బ్యాక్టీరియాలు ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి.

  • పచ్చి పాలను తాగటం వలన వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి,జ్వరం, తలనొప్పి, శారీరక నొప్పులు, ఫ్లూ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే ఆరోగ్యంగా ఉన్నవారు పచ్చి పాలలో హానికరమైన బ్యాక్టీరియా వల్ల కలిగే అనారోగ్యం నుండి తొందరగా కోలుకుంటారు. కొంతమందికి దీర్ఘకాలిక మరియు తీవ్రమైన సమస్యలు ఉండవచ్చు.

  • పాలను బాగా మరగబెట్టి చల్లార్చిన తర్వాత తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు పచ్చి పాలను అసలు తీసుకోకూడదు. అలాగే ఊపిరితిత్తులకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పచ్చి పాలు తాగడం వల్ల శరీరంలో ఆమ్ల స్థాయి పెరుగుతుంది.
  • శరీరంలో యాసిడ్ పెరిగతే ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. అందుకే పచ్చిపాలను తాగకపోవడమే మంచిది. పచ్చిపాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చిపాలు తాగేవారు కాచి చల్లార్చిన పాలను తాగటం అలవాటు చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here