- ఈజీ మనీకోసం పోతె కటకటలేనని తెనాలి డి యస్పి స్రవంతిరాయ్ అన్నారు .తెనాలిలోని తన కార్యాలయంలో ఏర్పాట చేసిన మీడియా సమావేశంలో కొల్లిపర ఠాణా పరిథిలో గతనెల 20న జరిగిన భారీచోరీ ఛేదన విషయంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
- ప్రథాన ముద్థాయి కొల్లిపర కు చెందిన షేక్ అప్సర్ తన 11మంది అనుచరు లతో 2మారతీ ఎరిటిగా కార్లలో కొల్లిపరలోని భీమవరపు మీనాకుమారి భర్త గురవారెడ్డి ఇంట్లో చొరబడి ప్రహారీగోడ దూకి మెష్ తలుపును కోసి ఇంట్లో 10 లక్షల నగదు 4సవర్ల బంగారం తీసుకొని ,మథ్యలో కొంతదూరం వచ్చి ఇప్ఫుడే పంచుకంటే దొరికిపోతామన్న భయంతో తిరిగి తాను అంటే అప్సర్ చెప్పిన రోజు న అంటే ఈరోజున బుథవారం 10న నందివెలుగు వంతెన చౌరాస్తావద్ద కలుసుకొని పంచుకోవటాలు మరో నేరం గురించి మాట్లాడుకొను చుండగాతెనాలి తాలూక సిఐ సబ్రమణ్యం మరియు కొల్లిపర యస్సై రవీంద్రరెడ్డి లు సాంకేతిక ఆథారాలతో వారిలో 9మందిని పట్టుకొని అరెష్టు చేశారు.
- వారినుండి 8.50లక్షల నగదు ,రెండు కార్లు ,వారందరి సెల్ ఫోన్లు 4శలర్ల బంగారం స్వాథీనం చేసకోవటం జరిగింది.ఇందలో ఇంకా ముగ్గురిని అదూపులోకి తీసకోవాల్సి అంది.
- ఈ చోరీ లో సాంకేతిక పరిఙ్ఞానం ఉప యేగించి ఛేదించిన తాలూక సి ఐ సబ్రమణ్యం యస్సై రవీంద్ర రెడ్డి లను , సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
- విచిత్రం ఏమిటంటేాఇందులో నిందితులు కృష్ణా ,పల్నాడు గుంటూరు నల్గొండ మిర్యాలగూడ బాపట్ల జిల్లాలలో వేరు ప్రదేశవాసులు.