ఎలిజబెత్ 2 అంత్యక్రియలకు ద్రౌపది ముర్ము

0
9
Draupadi Murmu at Elizabeth 2's funeral

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌కు బయలుదేరారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 అంత్యక్రియల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ నెల 19న ఎలిజబెత్ 2 అంత్యక్రియలు జరగనుండగా.భారత ప్రభుత్వం తరపున సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి లండన్‌కు వెళ్లారు.భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ సెప్టెంబర్ 12న ఢిల్లీలోని బ్రిటిష్ హై కమిషన్‌ కార్యాలయానికి వెళ్లి భారత్‌ తరఫున సంతాపం తెలియజేశారు.

క్వీన్ ఎలిజబెత్ 2 మృతి పట్ల సంతాప సూచకంగా భారతదేశం సెప్టెంబర్ 11న జాతీయ సంతాప దినం నిర్వహించింది. సెప్టెంబర్ 8న 96 ఏళ్ల వయసులో వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here