ఎంపీ కేశినేని నాని పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రెయేట్ చేసి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కేశినేని భవన్
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్(నాని) పేరు పైన సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లు తెలిసింది. ఎంపీ నానికి సంబంధం లేకుండానే.. ఫోటో, పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేసి, ఆ అకౌంట్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది.
ఎంపీ నాని పేరు మీద నకిలీ అకౌంట్‌ను క్రియేట్ చేసి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కేశినేని భవన్ కార్యాలయ కార్యదర్శి తెలిపారు.