- కంభం.. అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంభం రైల్వేస్టేషన్ సమీపంలో రన్నింగ్ లో ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. వీరందరూ గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దైవదర్శనం కోసం సిరిగిరిపాడు నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

- ప్రమాదంలో మృతి చెందిన మృతులలో జలకంటి నాగిరెడ్డి(22) చిలకల అనిమి రెడ్డి(75), పల్లె అనంత రామమ్మ (50), చిలకల ఆదిలక్ష్మి(70), భూమిరెడ్డి గురువమ్మ(70) గా పోలీసులు గుర్తించారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో నుంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
