గూగుల్‌కు చెందిన కొన్ని సర్వీస్‌ల్లో కాసేపు అంతరాయం ఏర్పడింది. ఎర్రర్ 500 అని చూపించాయి. దీంతో చాలా మంది యూజర్లు ఫిర్యాదులు చేశారు. ట్వీట్లు చేశారు. కొంతసేపటికి సమస్యను పరిష్కరించింది గూగుల్.
ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ అందిస్తున్న సర్వీస్‌లకు అంతరాయం కలిగింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మ్యాప్స్ గూగుల్ ఫొటోస్ గూగుల్ డ్రైవ్, గూగుల్ డ్యుయో , జీమెయిల్ , యూట్యూబ్ తో పాటు మరికొన్ని గూగుల్ సేవలు కాసేపు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యూజర్లు రిపోర్ట్ చేశారు. ట్విట్టర్లో వేలాది మంది ఈ గూగుల్ ఔటేజ్ గురించి ట్వీట్లు చేశారు. (#Googledown) హ్యాష్‌ట్యాగ్‌తో వేలాది మంది పోస్ట్‌లు చేశారు.

డౌన్‌డిటెక్టర్ కూడా గూగుల్ ఔటేజ్ను గుర్తించింది. ఈ ఔటేజ్‌కు కారణమేంటి.. ప్రస్తుత పరిస్థితి ఏంటి.. యూజర్ల రియాక్షన్స్ ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు చూడండి.
భారత కాలమానం ప్రకారం గూగుల్‌కు చెందిన చాలా సర్వీస్‌ల్లో ఉదయం 6.37 గంటల నుంచి అంతరాయం మొదలైంది. 7.07 గంటలకు ఈ సమస్య మరింత తీవ్రమైంది. దీంతో దాదాపు 41వేల మంది ఫిర్యాదులు చేశారు. 500 ఎర్రర్ వస్తోందని కంప్లైట్స్ చేశారు. ఇక ట్విట్టర్లో ఈ విషయంపై ట్వీట్లు వెల్లువెత్తాయి. వెంటనే స్పందించిన గూగుల్ సమస్యను పరిష్కరించేసింది.
కారణమిదే..!
సర్వీస్‌ల్లో సమస్యను గూగుల్ వెంటనే గుర్తించింది. సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్య వల్ల ఇలా జరిగిందని వెల్లడించింది. ఈ అంతరాయానికి అదే కారణమని చెప్పింది. ఆ తర్వాత సమస్యను పరిష్కరించింది. దీంతో గూగుల్ సర్వీస్‌లన్నీ మళ్లీ అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి.
ప్రపంచం అంతమవుతుందా? యూజర్ల రియాక్షన్స్
గూగుల్ సర్వీస్‌ల్లో అంతరాయం రావడంతో యూజర్లు ట్విట్టర్లో పోస్ట్‌ల వర్షం కురిపించారు. చాలా మంది సమస్యను తెలుపడంతో విభిన్నంగా స్పందించారు. ప్రపంచం అంతమవుతోందా? గూగుల్ డౌన్, గూగుల్ డౌన్” అంటూ మెలిసా రిచర్జ్ అనే యూజర్ ట్వీట్ చేశారు. 500 ఎర్రర్ వచ్చిన వెబ్‌పేజీ స్క్రీన్‌షాట్‌ను కూడా జత చేశారు. ఫస్ట్ టైమ్ గూగుల్ ఎర్రర్ చూపిస్తోంది. ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది” అని మరో యూజర్ పోస్ట్ చేశారు. గూగుల్ డౌన్. ఇవి చివరి రోజులా అంటూ మరో యూజర్ స్పందించారు. అలాగే హ్యాష్‌ట్యాగ్‌పై చాలా మంది యూజర్లు ఫన్నీ రియాక్షన్లు, మీమ్స్ కూడా పోస్ట్ చేశారు.