- రక్షా బంధన్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్రంలో తెలుగింటి ఆడపడుచులు అందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. రక్షాబంధనం సోదరీ సోదరుల నడుమ ఆత్మీయతలు, అనురాగాలను ఇచ్చి పుచ్చుకునే పండుగ అన్నారు.
- తమ బంధం పటిష్టంగా ఉండాలని సోదర సోదరీమణులు జరుపుకునే ఈ వేడుక ఒకరికి ఒకరు అండగా ఉంటామన్న భరోసాను కలిగిస్తుందని గవర్నర్ పేర్కొన్నారు మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పూర్ణిమగా వ్యవహరిస్తారని గౌరవ హరి చందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.