నాకేమీ టెన్షన్ లేదు… వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు

0
11
  • తనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని రాష్ట్ర పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై రాష్ట్ర పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారంపై ఎస్పీ గోరంట్ల మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి చెబుతున్నట్లుగానే.. ఇది వంద శాతం ఫేక్ వీడియో అని తేల్చి చెప్పారు.
  • తనపై కుట్రలు చేసిన వారు కచ్చితంగా చట్టానికి దొరుకుతారని.. శిక్షింపబడుతారని ఎంపీ గోరంట్ల మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటపడతానని తెలుసని.. అందుకే, తాను మొదటి నుంచి టెన్షన్ పడలేదు.. పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నానని చెప్పారు. ఇక, తననపై ఫేక్ వీడియో పోస్ట్ చేసిన వారిపై, అలాగే, దాన్ని ప్రసారం చేసిన మీడియా రెండు మీడియా ఛానల్స్‌పై క్రిమినల్ కేసులు పెట్టిస్తా.. పరువునష్టం దావా వేస్తానని వెల్లడించారు.
  • ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై సైతం గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి.. హైదరాబాద్ నుంచి పరారై వచ్చారని ఆరోపించారు. చంద్రబాబు నిజాయితీపరుడైతే.. ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపొచ్చు కదా అని సవాల్ విసిరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here