రోజు వేధింపుల,అత్యాచార కేసుల్లో…రాజధాని ఢిల్లీ టాప్

0
3

Delhi police data: ఢిల్లీలో ప్రతి రోజు 6 అత్యాచారాలు, 7 వేధింపుల కేసులు దేశ రాజధాని ఢిల్లీలో నమోదు అవుతున్నట్లు పోలీసు డేటా వెల్లడించింది.

గతేడాదితో పోలిస్తే ఈ యేడాది ఈ కేసుల సంఖ్య పెరిగింది. అత్యాచార కేసుల్లో 6 శాతం, వేధింపుల కేసుల్లో 17 శాతం పెరుగుదల ఉన్నట్లు రికార్డులు పేర్కొన్నాయి. కాగా, ఈ యేడాది ఆరు నెలల్లో 1,100 రేప్ కేసులు, 1,400లకు పైగా వేధింపు కేసులు నమోదు అయ్యాయి.

గతేడాది జనవరి నుంచి జూలై 15 మధ్య 1,244 వేధింపు కేసులు నమోదు అయ్యాయి. అత్యాచారాలు, వేధింపులపై అవగాహన పెరుగుతుండడంతో కేసుల నమోదు సంఖ్య పెరుగుతోందని, కేసుల నమోదు కోసం హెల్ప్ లైన్ బూతులను ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

డేటా తెలిపిన వివరాల ప్రకారం.. మహిళల అపహరణ కేసులు కూడా బాగానే నమోదు అవుతున్నాయి. ఈ యేడాది జూలై వరకు ఢిల్లీ వ్యాప్తంగా 2,197 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయి. ఇది గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 20 శాతం ఎక్కువ. దీంతో పాటు గృహ హింస కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ యేడాది ఇప్పటి వరకు 2,704 కేసులు గృహ హింస కింద నమోదు అయ్యాయి. కాగా, ఇదే సమయం గతేడాదిలో 2,096 కేసులు నమోదు అయ్యాయి. కాగా, 60 శాతం అత్యాచార కేసుల్లో ఫిర్యాదు చేసిన 7-8 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 95 శాతం కేసుల్లో చార్జ్ షీట్ ఫైల్ చేశారట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here