- భారత 14 వ ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో దర్భార్ హాల్ లో ఈ కార్యక్రమం జరగగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు.

- ఉప రాష్ట్రపతి జగదీప్ వృత్తి రీత్యా న్యాయవాది. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కూడా ఆయన న్యాయవాదిగా పని చేస్తూనే వచ్చారు. రాజస్థాన్ హైకోర్టులో లాయర్ గా పనిచేసిన ధన్కర్.. మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ చొరవతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పని చేశారు.
- అనంతరం 1991లో పీవీ నర్సింహారావు హయంలోనూ మంత్రిగా సేవలు అందించారు. అంతేకాకుండా ఎంపీగా, గవర్నర్ గా సేవలందించిన ఆయన.. తాజాగా ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.