ఎన్నికల్లో పంచేందుకు కేసీఆర్ రూ.15 వేల కోట్లు.

0
4
  • సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వారి కళ్లలో కేసీఆర్ మట్టి కొట్టారని మండిపడ్డారు. 57 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పి, 60 ఏళ్లు నిండిన వారికి కూడా మంజూరు చేయడం లేదని విమర్శలు గుప్పించారు.
  • వచ్చే ఎన్నికల కోసం సీఎం కేసీఆర్‌ రూ.15 వేల కోట్లు తీసి పక్కన పెట్టారని.. అన్ని నియోజకవర్గాల్లో డబ్బు, మద్యం పంచి ఓట్లు అడుగుతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. ‘ఆయన ఇచ్చేవి ఇంట్లో నుంచి తెచ్చి ఇవ్వడం లేదు తీసుకుందాం మనకే ఓటు వేసుకుందాం. కాంగ్రెస్‌కు ఓటేసినా టీఆర్ఎస్‌కు వేసినట్టే. కేసీఆర్‌ నామరూపాలు లేకుండా పోవాలంటే బీజేపీకే ఓటేయాలి. బీజేపీ మాత్రమే కేసీఆర్‌తో బరిగీసి కొట్లాడుతుంది.’అని చెప్పారు.
  • యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో మంగళవారం వివిధ పార్టీల నుంచి పలువురు బీజేపీలో చేరారు. వారికి ఈటల కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్‌ కుటుంబంలో తప్ప ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. తుర్కపల్లి మండలంలో వెనుకబడిన గ్రామాలే ఇందుకు నిదర్శనమన్నారు.
  • దేశంలోనే అత్యధికంగా మద్యం తాగుతున్న రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. ‘కొండగట్టు అంజన్న దగ్గర బస్సు ప్రమాదంలో 67 మంది చనిపోయారు. వారికి ఇప్పటికీ సాయం అందలేదు. రాష్ట్రంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకునే దిక్కులేదు. కానీ మన సొమ్ము తీసుకెళ్లి పంజాబ్‌లో పంచిపెడుతున్నారు. ఈయన ఉంది మన కోసమా? మంది కోసమా? ఇక్కడ ప్రజలు కనిపించడం లేదా కేసీఆర్..’ అని ప్రశ్నించారు.
  • నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి యువత కళ్లలో కేసీఆర్ మట్టి కొట్టారని ఈటల మండిపడ్డారు. 57 ఏళ్లకే పింఛన్లు ఇస్తానని చెప్పి, 60 ఏళ్లు నిండిన వారికి కూడా మంజూరు చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్‌ను గద్దె దించుడే మనందరి పంతం కావాలని ఈటల పిలుపునిచ్చారు. హుజూరాబాద్ తీర్పు రాష్ట్రమంతా పునరావృతం కానుందన్నారు. బీజేపీకి అధికారం కనుచూపుమేరలోనే ఉందని, తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానేనని ధీమా వ్యక్తంచేశారు.
  • ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బూడిద భిక్షమయ్య గౌడ్, పీవీ శ్యామ్ సుందర్, దాసరి మల్లేశం, రాఘవుల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here