Loan తీసుకునే వారికి తీపికబురు

0
5
SBI removes processing fee
SBI removes processing fee

దేశ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ తీసుకునే వారికి ఊరట కలిగే ప్రకటన చేసింది. హోమ్ లోన్ తీసుకునే వారికి ప్రాసెసింగ్ ఫీజులో మినహాయింపు కల్పించింది. 50 నుంచి 100 శాతం వరకు మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ ఆగస్ట్ 1 నుంచి ప్రారంభమైంది. సెప్టెంబర్ నెల చివరి వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు.ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం.. హోమ్ లోన్‌, హోమ్ రిలేటెడ్ లోన్స్ (టేకోవర్స్ కాకుండా) బేసిక్ ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే హోమ్ లోన్ టేకోవర్, టాప్ అప్ సంబంధిత రుణాలకు అయితే బేసిక్ ప్రాసెసింగ్ ఫీజులో 100 శాతం తగ్గింపు లభిస్తోంది. అలాగే అడ్వాకోట్ అండ్ వాల్యూయర్ ఫీజు- యాక్చువల్ ఎక్స్‌పెన్సెస్ వంటి వాటిలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా లాగిన్ ఫీజు, టెక్నికల్ అసెస్‌మెంట్ ఫీజు, లీగల్ ఫీజు, ఫ్రాకింగ్ ఫీజు, ప్రీ ఈఎంఐ చార్జ్, రెగ్యులేటరీ చార్జీలు, రీఅప్రైజల్ ఫీజు, ఇన్సూరెన్స్ ప్రీమియం, నోటరీ ఫీజు, అడ్జుడికేషన్ ఫీజు వంటివి కూడా ఉంటాయని గుర్తించుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here