ఈ APPS మీ ఫేస్‌బుక్, బ్యాంక్ పాస్‌వర్డ్స్‌ను దోచేస్తున్నాయట

0
2

కొన్ని ఆండ్రాయిడ్‌ యాప్స్‌లోని మాల్‌వేర్‌లు స్మార్ట్‌ఫోన్ యూజర్ల డేటాకు రిస్క్‌గా మారుతున్నాయి. అలాంటి యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ క్రమంగా తొలగిస్తోంది. తాజాగా జోకర్, ఫేస్‌స్టీలర్, కోపర్ మాల్‌వేర్ ఉన్న కొన్ని యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నట్టు సెక్యూరిటీ కంపెనీ స్కేలర్ థ్రెట్ ల్యాబ్జ్ (Zscaler ThreatLabz) తాజాగా గుర్తించింది. దీంతో ప్లే స్టోర్‌లో ఆ యాప్స్‌ను గూగుల్ తొలగించినట్టు సమాచారం. అయితే ఒకవేళ ఇంతకు ముందే ఎవరైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే ఫేస్‌స్టీలర్ మాల్‌వేర్ ఉన్న యాప్స్ మీ ఫేస్‌బుక్ సమాచారాన్ని దోచేస్తాయి. జోకర్ మాల్‌వేర్ ఉంటే ఆ యాప్స్.. మీకు తెలియకుండానే పెయిడ్ సబ్‌స్కిప్షన్‌లను యాక్టివేట్ చేసి మీ బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బును మాయం చేస్తాయి. కోపర్ ట్రోజన్.. బ్యాంకింగ్ యాప్స్‌ను టార్గెట్ చేస్తుంది. మరి ఈ ప్రమాదకర మాల్‌వేర్లు ఉన్నట్టు తాజాగా వెల్లడైన యాప్స్ ఏవో చూడండి.

మాల్‌వేర్‌ను కలిగి ఉన్నట్టు తేలిన యాప్స్ ఇవే

 • సింపుల్ నోట్ స్కానర్ (Simple Note Scanner)
 • ప్రైవేట్ మెసెంజర్ (Private Messenger)
 • స్మార్ట్ మెసేజెస్ (Smart Messages)
 • టెక్స్ట్ ఎమోజీ ఎస్ఎంఎస్ (Text Emoji SMS)
 • బ్లజ్ ప్రజర్ చెకర్ (Blood Pressure Checker)
 • ఫన్నీ కీబోర్డ్ (Funny Keyboard)
 • మెమరీ సైలెంట్ కెమెరా (Memory Silent Camera)
 • కస్టమ్ థీమ్డ్ కీబోర్డ్ (Custom Themed Keyboard)
 • లైట్ మెసేజెస్ (Light Messages)
 • థీమ్స్ ఫొటో కీబోర్డ్ (Themes Photo Keyboard)
 • మ్యాజిక్ ఫొటో ఎడిటర్ (Magic Photo Editor)
 • థీమ్స్ చాట్ మెసెంజర్ (Themes Chat Messenger)
 • ఇన్‌స్టాంట్ మెసెంజర్ (Instant Messenger)
 • ఫాంట్స్ ఎమోజీ కీబోర్డ్ (Fonts Emoji Keyboard)
 • మినీ పీడీఎఫ్ స్కానర్ (Mini PDF Scanner)
 • స్మార్ట్ ఎస్ఎంఎస్ మెసేజెస్ (Smart SMS Messages)
 • పర్సనల్ మెసేజ్ (Personal Message)
 • ప్రొఫెషనల్ మెసేజెస్ (Professional Messages)
 • ఆల్ ఫొటో ట్రాన్స్‌లేటర్ (All Photo Translator)
 • చాట్ ఎస్ఎంఎస్ (Chat SMS)
 • స్మైల్ ఎమోజీ (Smile Emoji)
 • ఫాంట్స్ ఎమోజీ కీబోర్డ్ (Forts Emoji Keyboard)
 • బ్లడ్ ప్లజర్ డైలీ (Blood Pressure Daily)
 • హాయ్ టెక్స్ట్ ఎస్ఎంఎస్ (Hi Text SMS)
 • ఎమోజీ థీమ్ కీబోర్డ్ (Emoji Theme Keyboard)
 • టెక్స్ట్ ఎస్ఎంఎస్ (Text SMS)
 • కెమెరా ట్రాన్స్‌లేటర్ (Camera Translator)
 • సోషల్ మెసేజ్ (Social Message)
 • కూల్ మెసేజెస్ (Cool Messages)
 • కమ్ మెసేజెస్ (Come Messages)
 • పెయింటింగ్ ఫొటో ఎడిటర్ (Painting Photo Editor)
 • రిచ్ థీమ్ మెసేజెస్ (Rich Theme Message)
 • ప్రొఫెషనల్ మెసేజెస్ (Professional Messages)
 • క్లాసిక్ గేమ్‌ మెసెంజర్ (Classic Game Messenger)
 • ప్రైవేట్ గేమ్స్‌ మెసేజెస్ (Private Game Massages)
 • క్రియేటివ్ ఎమోజీ కీబోర్డ్ (Creative Emoji Keyboard)
 • స్టైల్ మెసేజ్ (Style Message)
 • అడ్వాన్స్‌డ్ ఎస్ఎంఎస్ (Advanced SMS)
 • వావ్ ట్రాన్స్‌లేటర్ (Wow Translator)
 • ఆల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్ (All Language Translate)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here