మునుగోడులో ఉప ఎన్నికలు జరుగున్న నేపథ్యంలో ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. పెట్రోల్ ఒంటి మీద పోసుకొని ఆత్మహత్యకు పాల్పడగా శ్రావ్య టివి సిబ్బంది, స్థానికులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా శ్రావ్య టీవీ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన జనగామం నియోజకవర్గం అంకుషాపురం మండల వాసి అయిన ఆ వ్యక్తి 2001 నుంచి 2014 వరకూ తెలంగాణ ఉద్యమంలో పనిచేశానన్నారు. కళాకారులకు జాబ్ కార్డ్ ఇస్తామన్న కేసీఆర్ పట్టించుకోకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్కార్ పాలనలో తనలాంటి వాళ్లు ఎంతో మంది కళాకారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎంతో మంది చనిపోయారన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నారుగానీ కేసీఆర్ సర్కార్ ఏదీ ముందుకు సాగనివ్వలేదన్నారు. కచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ సర్కార్ ను అంతం చేయాలన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని నిలబెట్టాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
అడ్డుకున్న శ్రావ్య టీవీ సిబ్బంది..నిర్భంధించిన పోలీసులు
సదరు బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా శ్రావ్య టీవీ సిబ్బంది అడ్డుకున్నారు. బాధితుడికి సర్దిచెప్పి అతని బాధను తెలుకున్నారు. ఈ విషయాన్ని శ్రావ్య టీవీ కవరేజీ చేసిన తరుణంలో ఫిర్యాదు అందుకున్న పోలీసులు శ్రావ్య టీవీ సిబ్బందిని, బాధితుడు చిరంజీవిని అదుపులోకి తీసుకుని రెండు గంటలపాటు ఇబ్బందులు పెట్టారు.