తల్లి మరణించిన వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాజాగా మెహబూబ్ తన తల్లి మృతిపై ఎమోషనల్ పోస్ట్ వేశాడు.
mehaboob dilse mother death: బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ తన తల్లి మరణంతో కుమిలిపోతోన్నాడు. తన తల్లి గత నెలలో చనిపోయిందని చెప్పుకొచ్చాడు. జూలై 5వ తేదీ తన జీవితాన్ని మార్చిందని తెలిపాడు. తన తల్లి మృతిపై ఎమోషనల్ అవుతూ.. ఓ సుధీర్ఘమైన పోస్ట్ వేశాడు. తన తల్లి మీద తనుకున్న ప్రేమను అక్షర రూపంలో చెప్పుకొచ్చాడు. ఇక మెహబూబ్ వేసిన పోస్ట్‌తో అందరి గుండెలు బరువెక్కిపోతోన్నాయి. ఇంతకీ అందులో ఏముందంటే..
- అమ్మా.. నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్.. నేను ఇకపై నిర్ణయాలు ఎలా తీసుకోవాలి?.. నేను ప్రతీ రోజూ ఎవరితో మాట్లాడాలి?.. నువ్ లేకపోతే నేను ఎలా బతకాలి అమ్మా.. నువ్ లేకపోతే ఎలా బతకాలో అర్థం కావడం లేదమ్మా.. నువ్ నన్ను ఎప్పుడూ కూడా ఏ దానికి కూడా అడ్డు పడలేదు.. నా ఎదుగుదలను చూస్తూ మురిసిపోయావ్ అమ్మా.. నా గెలుపోటముల్లో నువ్ అండగా ఉన్నావ్ అమ్మా..
- నీ మాటలతో నాలో ఎప్పుడూ ధైర్యాన్ని నింపుతూ ప్రోత్సహించావ్.. అవే నన్ను ముందుకు నడిపించాయ్.. మా కోసం నువ్ ఎంతో పోరాడావ్ అమ్మా.. మా గురించి నువ్ నీ జీవితంతో పోరాడావ్.. ఎవ్వరూ చేయలేని విధంగా నువ్ మాకోసం చేశావ్.. మా కోసం అన్నీ త్యాగం చేశావ్.. నువ్ లేకపోతే మా ఈ జీవితాలు ఎటు వెళ్తాయో ఎక్కడికి వెళ్తాయో అర్థం కావడం లేదు..
- ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను అమ్మా.. జీవితం అంటే ఏంటో చూపించావ్ అమ్మా.. నువ్ ఎక్కడున్నా సరే నన్ను గమనిస్తుంటావ్ అని నాకు తెలుసమ్మా.. నువ్ గర్వపడేలా చేస్తాను అమ్మా.. తమ్ముడు శుభాన్, డాడీలను జాగ్రత్తగా చూసుకుంటానమ్మా.. మాటిస్తున్నాను అమ్మా..