అనంతపురం: ఆయన ఓ ఎంపీ, ఆయన చుట్టూ ఎప్పుడు వివాదాలే ఉంటాయి. అధికార బలంతో పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఆయనే ఎంపీ గోరంట్ల మాధవ్. తాజాగా గోరంట్ల మాధవ్ రాసలీలలు బయటపడ్డాయి. ఓ మహిళతో మాధవ్ నగ్నంగా వీడియోకాల్ మాట్లాడారు. సోషల్ మీడియాలో గోరంట్ల మాధవ్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయన తీరుపై మండిపడుతున్నారు.
- ఎంపీగా ఉంటూ మహిళతో నగ్నంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా లో మాధవ్ సీఐగా పనిచేస్తున్న సమయంలో ఓ మహిళతో ఇలాగే మాట్లాడారనే ఆరోపణలున్నాయి. పోలీస్ అధికారిగా ఎంపీగా ఆయన తీరు ఎప్పుడూ వివాదాస్పదమేనని పలువురు అంటున్నారు.
బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన ఎంపీ.. మహిళతో రాసలీలలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయన మాట్లాడిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. మాధవ్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఎంపీ పదవికి మాధవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ తీరు ఉందని మండిపడుతున్నారు.- వీడియో లీక్ కావడంతో వెంటనే మాధవ్‌పై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఓ నిజాయతీ గల పోలీస్ అధికారినని చెప్పుకుని.. ఆ ప్రచారంతోనే మాధవ్ ఎంపీగా గెలిచారని చెబుతున్నారు.