MS DHONI: కొత్త అవతారమెత్తిన ధోని…షాక్‌లో అభిమానులు

0
3

MUMBAI: ‘జెడ్‌ బ్లాక్‌’ అగర్‌బత్తి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్రికెటర్‌ “మహీంద్ర సింగ్‌ ధోనీ ” సంస్థ నూతన ప్రచార కార్యక్రమంలో ‘గురూజీ’ అవతారంలో కనిపించనున్నాడు.

ధోనీ ప్రచారంతో బ్రాండ్‌ ప్రజలకు మరింత చేరువ అవుతుందని జెడ్‌బ్లాక్‌ అగర్‌బత్తి బ్రాండ్‌ యజమాని మైసూర్‌ డీప్‌ పెర్‌ఫ్యూమ్‌ హౌస్‌ డైరెక్టర్‌ అంకిత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘దేశంలో టాప్‌-3 బ్రాండ్లలో జెడ్‌ బ్లాక్‌ ఒకటి. కంపెనీ వినూత్న ఆవిష్కరణలు సంస్థకు అంబాసిడర్‌ పనిచేసేందుకు ప్రోత్సాహాన్నిచ్చాయి’ అని ధోనీ చెప్పారు. ప్రస్తుత జెబ్‌ బ్లాక్‌ అగర్బత్తి మార్కెట్ రూ. 7,000 కోట్లుగా ఉండగా,దాదాపు ఈ కంపెనీ 20% వాటాను కలిగి ఉంది.

వాటి బ్రాండ్ల విషయానికొస్తే జెడ్ బ్లాక్ 3 ఇన్ 1, మంథన్ ధూప్, మంథన్ సాంబ్రాణి కప్స్‌, ఆరోగ్యం కాంఫర్‌, జెబ్‌ బ్లాక్ పైనాపిల్, శ్రీఫాల్, గౌవ్డ్ సాంబ్రాణి కప్స్‌, అరోమిక్స్, నేచర్ ఫ్లవర్ గోల్డ్, సియాన్ పేర్లతో మార్కెట్‌లో లభిస్తున్నాయి. కాగా ఐపీఎల్‌ 2022 తర్వాతా తెరపై మహేంద్ర సింగ్‌ ధోని కనపడడం ఇదే తొలిసారి. అయితే గురూజీ అవతారంలో ఉన్న ధోనిని చూసి మొదట నెటిజన్లు షాకయ్యారు. ఆ తర్వాత అగర్‌బత్తి యాడ్‌ కోసం అలా మారడని తెలుసుకుని ఈ గెటప్‌లో కూడా బాగున్నాడంటూ కామెంట్లు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here