Nelloreలో రొట్టెల పండగ.. 

0
2

ఐదు రోజుల పాటు సంబరాలే..!

నెల్లూరు రొట్టెల పండగ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రొట్టెల పండగ కోసం ప్రత్యేకంగా వస్తుంటారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ కూడా గతంలో రొట్టెల పండగకి వచ్చి రొట్టెలు స్వీకరించారు కూడా. ఈ ఏడాది భారీ ఏర్పాట్లతో అత్యంత వేడుకగా రొట్టెల పండగ నిర్వహించాలని అధికారులు సిద్ధమయ్యారు. ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నెల్లూరు రొట్టెల పండగ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రొట్టెల పండగ కోసం ప్రత్యేకంగా వస్తుంటారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ కూడా గతంలో రొట్టెల పండగకి వచ్చి రొట్టెలు స్వీకరించారు కూడా. ఈ ఏడాది భారీ ఏర్పాట్లతో అత్యంత వేడుకగా రొట్టెల పండగ నిర్వహించాలని అధికారులు సిద్ధమయ్యారు. ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు వారు అంచనా వేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి స్వర్ణాలచెరువు వద్ద కోర్కెల రొట్టెలను మార్చుకున్నారు

రొట్టెల పండగ కోసం బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువును అధికారులు విద్యుద్దీపాలతో అలంకరించారు. దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే 13వ తేదీ వరకు రొట్టెల పండగ నిర్వహించాలని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. ఇవాళ సొందల్ మాలీతో మొదలై.. 10న గంధోత్సవం (జియారత్), 11న రొట్టెల పండగ, 12న తహనీల్ ఫాతెహా జరుగుతుందని మత పెద్దలు చెప్పారు. 10, 11 తేదీల్లో జరిగే సంబరాలు చాలా ప్రత్యేకమైనవనిగా చెప్పొచ్చు.. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధాన్ని కలుపుకొని ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ కడప దర్గా పీఠాధిపతి చేతుల మీదుగా ప్రార్థనలతో అమరవీరుల సమాధులకు లేపనం చేస్తారు.. దీన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here