నిత్యామీనన్ నాపై లైంగిక వేధింపుల కేసు పెట్టాలని చూస్తోంది…

0
9

తనని చచ్చినా పెళ్లి చేసుకోను..సంతోష్ వర్కీ:

  • ఎన్నో తెలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన మలయాళ భామ నిత్యా మీనన్ ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో సంతోష్ వర్కీ అనే ఓ మలయాళ యూట్యూబర్ పై తనని వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది.
  • తన గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని, తనని పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతున్నాడని తెలిపింది. తన తల్లిదండ్రులు అతనికి సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారని తెలిపింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి.

  • తాజాగా నిత్యామీనన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ సంతోష్ వర్కీ ఓ మలయాళ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో సంతోష్ మాట్లాడుతూ.. ”నిత్యామీనన్ చెప్పేవాటిల్లో వాస్తవం లేదు. 30 నంబర్ల నుంచి కాల్స్ చేస్తున్నాను అని చెప్పింది. అసలు ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్‌కార్డులు ఇస్తారో తనకే తెలియాలి. నిత్యామీనన్‌కు వేరే వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందని వాళ్ల అమ్మ నాకు చెప్పింది. వాళ్ళ నాన్న ఏమో నిశితార్థం జరగలేదని అంటున్నాడు. వాళ్లు నాపై లైంగిక వేధింపుల కేసు కూడా పెట్టాలని చూస్తున్నారు. గతంలో నిత్యామీనన్‌ అంటే నాకు ఇష్టం ఉండేది. నిజంగానే తనను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు చచ్చినా ఆమెను పెళ్లిచేసుకోను. అసలు నిత్యామీనన్‌ గురించి ఇవన్నీ ముందే తెలిస్తే ప్రేమించి ఉండే వాడినే కాదు” అంటూ కామెంట్స్‌ చేశాడు.
  • దీనిపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ అసలు నువ్వు నిత్యామీనన్‌ను రిజెక్ట్‌ చేయడమేంటి? నీకంత సీన్‌ ఉందా? అసలు నువ్వు ఎవరో ఎంతమందికి తెలుసు? ఫేక్ సిమ్ కార్డులతో కాల్స్ చేసి ఉంటావుగా, నీకు నిత్యామీనన్ ని లవ్ చేసే రేంజ్ ఉందా? అంటూ సంతోష్ ని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here