NO యాక్సిడెంట్ డే బందోబస్తు

0
1

బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నో యాక్సిడెంట్ డే బందోబస్తు నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు

జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి అన్ని బ్లాక్ స్పాట్‌లలో అవసరమైన నో యాక్సిడెంట్ డే బందోబస్తు: జిల్లా ఎస్పీ

బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నో యాక్సిడెంట్ డే బందోబస్తు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా పోలీస్ అధికారులు, నో యాక్సిడెంట్ డే బందోబస్తులో భాగంగా జిల్లా పోలీస్ అధికారులు వాహనదారులకు రోడ్డు భద్రత నియమ నిబంధనల పై అవగాహన కల్పిస్తూ, నిబందలను పాటించని వాహనదారులకు చలన్లు విధిస్తు రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్న జిల్లా పోలీస్ అధికారులు.

జిల్లాలో ప్రతి శనివారం ప్రమాద రహిత దినంగా పాటించడం జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చర్యలు తీసుకుంటూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బ్లాక్‌స్పాట్‌ల వద్ద పోలీసు సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. బాపట్ల జిల్లాలో నో యాక్సిడెంట్ డే అమలులోకి వచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఎస్పీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here