NTR 30కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న..

0
7

ఎన్టీఆర్‌లో ఆ రెండు పెరిగిపోయాయి.. NTR 30 ఆలస్యంపై స్పందించిన కళ్యాణ్ రామ్

 NTR 30కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చేసింది. కానీ ఇంత వ‌ర‌కు సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దీంతో అస‌లు ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు కూడా, రూమ‌ర్స్ కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. NTR 30కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌టంతో టెన్ష‌న్‌లో తెలియ‌ని టెన్ష‌న్ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ సోద‌రుడు, నిర్మాత‌, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో NTR 30 అప్‌డేట్స్ గురించి మాట్లాడారు.

టాలీవుడ్‌లో త‌న‌దైన న‌ట‌న‌తో ఇటు మాస్‌, అటు క్లాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునే అగ్ర హీరోల్లో నంద‌మూరి ఎన్టీఆర్ ఒక‌రు. ఆయన సినిమా అంటే ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటార‌న‌డంలో సందేహ‌మే లేదు. RRRతో ఆయ‌నపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. నెక్ట్స్ సినిమా గురించి ఫ్యాన్స్, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తార‌క్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సినిమాను నిర్మిస్తున్నాయి.

NTR 30కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చేసింది. కానీ ఇంత వ‌ర‌కు సినిమా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. దీంతో అస‌లు ప్రాజెక్ట్ ఉంటుందా? లేదా? అనే సందేహాలు కూడా, రూమ‌ర్స్ కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. కానీ ఈ వార్త‌ల‌పై తార‌క్ టీమ్ ఏమీ రియాక్ట్ కావ‌టం లేదు. NTR 30కి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌టంతో టెన్ష‌న్‌లో తెలియ‌ని టెన్ష‌న్ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ సోద‌రుడు, నిర్మాత‌, హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో NTR 30 అప్‌డేట్స్ గురించి మాట్లాడారు.

NTR 30 విష‌యంలో తార‌క్ చాలా ఆలోచిస్తున్నారు. నిర్మాత‌లుగా మాపై కూడా చాలా బాధ్య‌త ఉంది. మేం కూడా అంతే ఆలోచిస్తున్నాం. డైరెక్ట‌ర్ కూడా ఎక్కువ‌గా ఆలోచిస్తున్నారు. ఆయ‌న‌లో ఎంత ప్రెజ‌ర్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అందువ‌ల్ల ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేంత ఫాస్ట్‌గా అప్‌డేట్స్ ఇవ్వ‌లేక‌పోతున్నాం. ప్ర‌తీ దానికి ఎక్కువ సార్లు ఆలోచించాల్సి వ‌స్తుంది’’ అని తెలిపారు నందమూరి కళ్యాణ్ రామ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here