ఎన్టీఆర్ సంచలన కామెంట్స్..పవన్ సీఎం ఐతే చూడాలని ఉంది

0
306
NTR's sensational comments

ఏపీలో జనసేన గ్రాఫ్ పెరుగుతోంది.అటు అన్నివర్గాల ప్రజలకు ఆ పార్టీకి దగ్గరవుతోంది.పవన్ కు ఒక్క చాన్సిచ్చి చూడాలన్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఆ జాబితాలో ప్రముఖులు సైతం ఉండడం విశేషం. ఇటీవల పవన్ కు మద్దతు తెలిపే వారు ఎక్కువవుతున్నారు. కొన్నిరంగాల ప్రముఖులు బయటకు వెల్లడించకపోయినా అంతర్గత చర్చల్లో మాత్రం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలమవుతోంది.కానీ పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగని పార్టీని డీ యాక్టివ్ చేయలేదు.ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా పవన్ పనిచేస్తున్నారు. తన సొంత డబ్బులు పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పంచి పెడుతున్నారు.జనవాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

ALSO READ: విశాఖ ఎయిర్‌పోర్ట్ లో వద్ద ఉద్రిక్తత https://v1media.in/tension-at-visakhapatnam-airport/

రాజకీయ పార్టీ నడపడం అంత సులభం కాదు.కానీ పవన్ తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో పాటు ఆస్తులను అమ్మి మరీ పార్టీని నడుపుతున్నారు.దీనిని కొందరు సాఫ్ట్ కార్నర్ లో చూస్తున్నారు.విపరీతమైన ప్రజాభిమానం ఉండి.. ఎంతో సంపాదించుకునే చాన్ష్ ఉన్నా పవన్ మాత్రం తనకు ప్రజాసేవ ఇష్టమని భావిస్తుంటారు.రాజకీయాలు అన్నవి పవన్ పాలిట్రిక్స్ కాదని ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని నమ్మే వ్యక్తి పవన్.ఆ పాయింట్ ను బేస్ చేసుకునే ఎక్కువ మంది ఆయన్ను ఫాలో అవుతుంటారు.

ALSO READ: విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు https://v1media.in/విద్యార్థినిపై-ప్రిన్సి/

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బేస్ తో మాట్లాడారట. పవన్ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయితే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందని అన్నారుట.ఇప్పుడు పొలిటికల్,సినీ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది.అయితే తారక్ తెలుగుదేశం పార్టీకి చెక్ చెప్పేందుకే ఈ కామెంట్స్ చేసి ఉంటారన్న టాక్ నడుస్తోంది.ఇటీవల ఆయన టీడీపీకి దూరంగా ఉన్నారు.ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు, అంతకంటే ముందు తన మేనత్త భువనేశ్వరిపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు పొడిపొడిగానే మాట్లాడారు.

దీనిపై టీడీపీ శ్రేణులు కూడా భగ్గుమన్నాయి.ఈ నేపథ్యంలో తనను టార్గెట్ చేసుకొని టీడీపీ,వైసీపీ, అటు బీజేపీ చేస్తున్న పొలిటిక్స్ చిన్న ఎన్టీఆర్ లో ఏహ్య భావాన్ని పెంచాయి. అదే సమయంలో నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న పవన్ పై సానుకూలత చూపించడానికి కారణమయ్యాయి, ఎలాగైతేనేం చిన్న పవన్ కు చిన్న ఎన్టీఆర్ అభిమానిగా మారిపోయారు.పవన్ ను అగ్రస్థానంలో చూడాలనుకున్నారు.దీనిపై మెగా అభిమానులు,అటు తారక్ ఫాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here