ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి:సీఎం జగన్

0
9
Pay special attention to those districts CM Jagan

గృహ నిర్మాణ శాఖపై సీఎం సమీక్ష

తాడేపల్లి: ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ, రెవెన్యూ, పురపాలక-పట్టణాభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖలతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.గృహనిర్మాణంలో ప్రగతిపై సమగ్రంగా సమీక్షించారు. గత సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు తీరును కూడా అధికారులు వివరించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 4,318 కోట్ల విలువైన పనులు చేశామని అధికారులు వివరించారు.

కాగ్‌ లెక్కలు.. కాకి లెక్కలా? ఈనాడు, ఆంధ్రజ్యోతిపై బుగ్గన మండిపాటు

తొలి విడతలో 15.6 లక్షలు, రెండో విడతలో 5.65 లక్షలు మొత్తంగా 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధి​కారులు తెలిపారు. వర్షాలు తగ్గగానే ప్రతి వారం కూడా ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుందని, అక్టోబరు నుంచి వారానికి 70 వేల ఇళ్ల చొప్పున ఒక దశ నుంచి వేరే దశకు నిర్మాణం అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని అధికారులు పేర్కొన్నారు. ఆప్షన్‌-3 (ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలన్న) ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు కూడా వేగవంతం చేస్తున్నామన్న అధికారులు ప్రతి వారం కూడా నిర్మాణ సంస్థలతో సమీక్ష చేస్తున్నామని అధికారులు తెలిపారు.

 • ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే…:
 • హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నాం.
 • ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలి.
 • గృహనిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టండి.
 • ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్న సీఎం.
 • ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగునీరు లాంటి కనీస వసతులు కల్పించాలన్న సీఎం.
 • కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దన్న సీఎం.
 • కాలనీల పరంగా ప్రాధాన్యతా పనులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని, ఆమేరకు పనులు చేపట్టాలని సీఎం ఆదేశం
 • టిడ్కో ఇళ్లపై సీఎం సమీక్ష.
 • ఇప్పటికే పనులు పూర్తయిన వాటిని లబ్ధిదారులకు అందిస్తున్నామన్న అధికారులు.
 • డిసెంబరు నాటికి అన్నింటినీ కూడా లబ్ధిదారులకు అందిస్తామన్న అధికారులు.
 • సీఎం ఆదేశాల మేరకు టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయ కల్పనా పనులు అత్యంత నాణ్యతతో చేపడుతున్నామన్న అధికారులు.
 • టిడ్కో ఇళ్ల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టిపెట్టామన్న అధికారులు.
 • టిడ్కో ఇళ్ల నిర్వహణపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్న సీఎం.
 • దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టాలు అందించే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష.
 • ఇప్పటికే 96.8 వేల మందికి పట్టాలు ఇచ్చామన్న అధికారులు.
 • మరో 1.07 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నామన్న అధికారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here