రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పాకిస్తాన్ సోదరి ఖమర్ మోషిన్ షేక్ రక్షా పంపించారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుతూ లేఖ రాశారు. ‘ప్రధాని నన్ను ఢిల్లీకి అహ్వానిస్తారని భావిస్తున్నాను. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాను. ప్రధాని కోసం నేనే స్వయంగా రాఖీని తయారు చేశాను’ అని అన్నారు. మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని లేఖ రాసినట్లు తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆయనే ప్రధాని అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఆయన ఆ సామర్ధ్యం ఉందని తెలిపారు. గతేడాది కూడా రక్షబంధన్కు ఆమె ప్రధానికి రాఖీ పంపారు…