Power Bill Protests:విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా..

0
4

 విద్యుత్ బిల్లుపై ఉద్యోగుల సమ్మె, కేంద్రమంత్రుల ఆఫీసులకు కరెంట్ కట్ చేస్తామని హెచ్చరికలు!

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు కూడా విధులు బహిష్కరించారు.

 కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసన గళం వినిపిస్తున్నారు. హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద సోమవారం మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు విద్యుత్ ఉద్యోగులు తెలంగాణ నలుమూలల నుంచి వచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

తెలంగాణలో మహా ధర్నా 

ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త చట్టంతో వినియోగదారులకే తీవ్ర నష్టమని తెలిపారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెడితే పూర్తిగా విధులను బహిష్కరించి నిరవధికంగా సమ్మెకు దిగేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు ఉద్యోగులు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ఈ బిల్లుతో అనేక సమస్యలు వస్తాయని, అసలు విద్యుత్‌ రంగాన్నే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటికరించేందుకు సిద్ధమవుతోందంటూ ఆరోపించారు. 

కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం 

నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా జనరేటింగ్‌ స్టేషన్లు, సర్కిల్‌, డివిజన్‌ కార్యాలయాల ముందు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తున్నారు. కేంద్రం చట్ట సవరణ పేరుతో డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. విద్యుత్‌ సంస్థలను కాపాడుకునేందుకు విద్యుత్ ఉద్యోగుల ఉద్యమంలో ప్రజలు సహకరించాలన్నారు. కేంద్రం దిగివచ్చే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టంచేశారు.  

సమ్మెలో 27 లక్షల మంది ఉద్యోగులు 

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు.  తెలంగాణలో విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపారు. అయితే ఈ సమ్మె వినియోగదారులపై ప్రభావం చూపనుంది. కేంద్రం సోమవారం పార్లమెంట్‌లో విద్యుత్తు చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లును నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగ సంఘాలు ఇవాళ్టి నుంచి మహా ధర్నా చేపట్టాయి. దేశవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యుత్తు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. డిస్కంలను పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ సంస్థలను పారిశ్రామివేత్తలకు కట్టబెట్టేందుకు ఈ బిల్లు పెడుతున్నారని మండిపడుతున్నాయి. కేంద్రం తెస్తున్న విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ 12 రాష్ట్రాలు తీర్మానం చేశాయి. కేంద్రం పార్లమెంట్‌లో విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడితే నిరసనలు మరింత తీవ్రం చేస్తామని విద్యుత్‌ సంఘాల నేతలు హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు. అవసరమైతే బీజేపీ నాయకులు, ఎంపీలు, కేంద్రమంత్రుల కార్యాలయాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here