సింధు కు స్వర్ణం…..

0
5
  • కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌ తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది.
  • తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది.
  • తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్‌ను 21-13 కూడా కైవసం చేసుకుంది. దీంతో భారత షట్లర్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి పసిడిని ముద్దాడింది.
  • అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here