జీవకళ ఉట్టిపడేలా కృష్ణంరాజు విగ్రహం.. నేడు హైదరాబాద్‌కు తరలింపు.!

0
4
Krishnam raju statue

ఇటీవల కన్నుమూసిన సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు‌కు ఘనంగా నివాళులు అర్పించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన రూపాన్ని నిత్యం స్మరించుకునేలా విగ్రహాన్ని తయారుచేస్తున్నారు.

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండల కేంద్రంలో ఈ విగ్రహాన్ని తయారు చేయిస్తున్నారు. ఈ పనులను స్థానిక శిల్పి వడయార్‌కు అప్పగించారు. కృష్ణంరాజు కుటుంబసభ్యులు ఇచ్చిన సూచనల మేరకు వడయార్ ఆరు రోజులు శ్రమించి ఫైబర్‌తో జీవకళ ఉట్టిపడేలా విగ్రహాన్ని తయారుచేశారు.కృష్ణంరాజు విగ్రహానికి రంగులు వేసే పని కూడా పూర్తికావడంతో నేడు ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు పంపుతున్నట్లు శిల్పి వడయార్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here