ఆస్కార్ రేసు నుంచి RRR అవుట్…

0
7
RRR out of Oscar race...

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. హాలీవుడ్ డైరెక్టర్లు, క్రిటిక్స్, ఆడియెన్స్ అందరూ కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాను, డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించారు.ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పర్ఫామెన్స్ మీద అంతర్జాతీయ పత్రికలు ప్రశంసలు కురిపించేశాయి. వెరైటీ మ్యాగజైన్ అయితే ఆస్కార్ రేసులో కచ్చితంగా ఉంటారని పేర్కొంది.

అలా ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఆస్కార్ ఆశలు పెరిగాయి.ఉత్తమ నటుడిగా కేటగిరీల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ఉంటాయని, రేసులో మన వాళ్లున్నారంటూ ఇలా అందరూ సంతోషించారు. కానీ ఈ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అసలు మన వాళ్లే ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్లకు పంపించలేదు. ఇక్కడి వడపోతలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను పక్కన పెట్టేశారు.

దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు తీవ్రంగా హర్ట్ అవుతున్నారు. ఛెల్లో షో సినిమా గురించి కామెంట్లు పెడుతున్నారు. ఇటాలియన్లో వచ్చిన సినిమా పారడిజో అనే చిత్రానికి రీమేక్‌గా ఉటుందని, స్లమ్ములో పెరిగే చిన్న పిల్లాడు.. సినిమాతో ప్రేమలో పడటంపై ఈ సినిమా ఉంటుందని, అలాంటి చిత్రాన్ని ఆస్కార్ రేసులోకి పంపిస్తారా? అంటూ సెలెక్షన్ కమిటీ మీద మండిపడుతున్నారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇంతటితో ఆస్కార్ ఆశలు ఆవిరైనట్టే అనిపిస్తోంది. ఇక ఇప్పుడు నెట్టింట్లో ఛెల్లో షో, ఆర్ఆర్ఆర్‌కు పోలికలు మొదలయ్యాయి. ఇందులో రాజకీయ కోణాన్ని కూడా అందరూ చూస్తున్నారు. ఇది గుజరాతీ చిత్రం కావడంతో బీజేపీతో లింకులు పెడుతున్నారు. మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం ఆస్కార్ రేసు నుంచి తప్పుకున్నట్టు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here