భువనేశ్వర్ నుంచి భోగాపురం వరకు ఆరు లైన్ల హైవే:గడ్కరీ

0
9
Six lane highway from Bhubaneswar to Bhogapuram Gadkari

కాకినాడ: ఏపీలో రూ.5లక్షల కోట్లతో హైవేల అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. 2024నాటికి ఏపీలో హైవే ప్రాజెక్టులు పూర్తవుతాయని వెల్లడించారు.వచ్చే 3 నెలల్లో ఏపీకి మరో రూ.3వేల కోట్ల ప్రాజెక్టులు అందిస్తామన్నారు. రాజమహేంద్రవరంలో పర్యటించి పలు హైవే ప్రాజెక్టులు, పైవంతెనలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ నౌకాయానంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమైన రాష్ట్రం.

ఏపీ ప సర్కార్‌ ముందుకొస్తే లాజిస్టిక్‌ పార్క్‌ ఇస్తాం. భువనేశ్వర్‌ నుంచి భోగాపురం వరకు 6 వరుసల హైవే నిర్మాణం చేపడతాం. విజయవాడ తూర్పు బైపాస్‌ మంజూరు చేస్తాం. రాజమహేంద్రవరం-కాకినాడ కెనాల్‌ రోడ్‌ మంజూరు చేస్తాం, ప్రస్తుతం వాయు కాలుష్యం అన్నింటికంటే పెద్ద సమస్య. భవిష్యత్తు అంతా గ్రీన్‌ ఎనర్జీదే” అని గడ్కరీ వెల్లడించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here