తూర్పుగోదావరి జిల్లా లో వింత ఘటన..కళ్లు తెరిచిన అమ్మవారు

0
25
Strange incident in East Godavari district..Ammavaru who opened his eyes

తూర్పుగోదావరి జిల్లా లో వింత ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కడియం మండలం కడియపులంక చింతలోని ఓ ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కళ్ళు తెరిచింది. సాధారణంగా దేవతా విగ్రహాలు కళ్లు మూసి ఉన్నట్లుగాని, సగం మాత్రమే తెరిచి ఉన్న ట్టుగా ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. నవంబరు 21న ఆఖరి కార్తీక సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

ఈ క్రమంలో కడియపులంకలోని లక్ష్మీదేవి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారు కళ్ళు తెరిచి ఉండటం అంతరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వార్త క్షణాల్లో వ్యాపించడంతో భక్తులు ఆ వింతను చూడటానికి పోటెత్తారు. కళ్లుతెరిచి దర్శనమిచ్చిన లక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం రోజున ఈ వింత చోటు చేసుకోవడంతో మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here