చైనా, తైవాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగం డిప్యూటీ చీఫ్ శనివారం ఉదయం హోటల్ గదిలో శవమై కనిపించారు. మిలట్రీ ఆధ్వర్యంలో పనిచేసే పరిశోధన, తయారీ విభాగం ఎన్‌సీఎస్ఐఎస్‌టీ NCSIST డిప్యూటీ డైరక్టర్ యూ యంగ్ లీ హింగ్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. దాంతో ఆయన మృతి పలు సందేహాలను కలిగిస్తుంది. అధికారులు మృతికి గల కారణాలను దర్యాప్తు మొదలుపెట్టారు.