రామచంద్రాపురం: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో బుడగజంగాల కమ్యూనిటీ హాల్ నిర్మా ణానికి గతంలో పంచాయతీ కేటాయిం చిన స్థలాన్ని స్వాధీన పర్చుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే దృష్టికి కౌన్సిలర్ సుచరిత కొమురయ్య ఈ అంశాన్ని తీసుకువచ్చారు. ఆ స్థలంలోనే కమ్యూ నిటీ హాల్, అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.
ఎమ్యెల్యే మరియు కౌన్సిలర్ చొరవతో ఎట్టకేలకు కమ్యూనిటీ హాల్ కు పర్మిషన్ రావడం తో బుడగ జంగాల సంగేమ్ పెద్దలు మరియు అక్కడి యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజుల కల అని వ్యాఖ్యనించారు. ఇప్పటి వరకు చాల మంది రాజకీయ నాయకులు మేము చేస్తామని చెప్పినారు కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేక పోయారు. బుడగ జంగాలకి అండగా ఉంటామని ఎమ్మెల్యే, కౌన్సిలర్ మాకు మాట ఇచ్చారు. దింతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పనునులు కూడా ప్రారంభించడం జరిగింది.