వైసీపీ ఎంపీ గోరంట్ల.మాధవ్ వికృత చేష్టలు, న్యూడ్ వీడియోకాల్స్, రాష్ట్ర మహిళలకు కరువవుతున్న రక్షణ, రోజురోజుకూ పెరుగుతున్న పోలీసు, రాజకీయ నిర్బంధాలు, అక్రమ కేసులు, వేధింపులు, తదితర ముఖ్యమైన అంశాలపై జగన్ రెడ్డి అవలంభిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై గర్జించేందుకు తెలుగుదేశం పార్టీ ఓ వేదికను నిర్వహించబోతోంది. ఈనెల 9న విజయవాడలోని స్వర్ణ హోటల్ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. మీ పార్టీ నుండి హాజరై రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వ అక్రమాలు, ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఇప్పటి వరకు స్పందించని ముఖ్యమంత్రి ధోరణిపై మీ గళం విప్పడానికి సవినయంగా ఆహ్వానిస్తున్నాము……తప్పక హాజరై భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమంలో భాగస్వాములై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాము.
ఇట్లు,
వంగలపూడి అనిత,
టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు.